17న తీరం దాటనున్న తుపాను!

విజయనగరం: ఒంగోలు- కాకినాడ మధ్య ఈనెల 17వ తేదీన తుపాను తీరం దాటే అవకాశముందని చెప్పారు విజయనగరం జిల్లా ఇంచార్జ్‌ కలెక్టర్‌ వెంకట రమణా రెడ్డి. గంటకు 90 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తోన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆయన. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో తుపానుతో ధాన్యం నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు వేగవంతం చేశామని చెప్పారు ఇంచార్జ్‌ కలెక్టర్‌. జిల్లాలోని 34 మండలాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు ఇంచార్జ్‌ కలెక్టర్‌ వెంకట రమణా రెడ్డి.

పశ్చిమ, తూర్పు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కృష్ణా జిల్లాకు తుఫాను ప్రభావం తప్పింది. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates