17న వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఈ నెల 17న బాధ్యతలు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను సీఎం కేసీఆర్ అప్పగించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి దేశ రాజకీయాలపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. సోమవారం ఉదయం పదకొండు గంటలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోనున్నారు కేటీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates