17 నుంచి యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు

9038_Yadadri-Brahmotsavamయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 23న శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవం, 24న కల్యాణం నిర్వహిస్తామన్నారు. 24న సీఎం కేసీఆర్ సతీసమేతంగా కల్యాణోత్సవానికి హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పిస్తారని తెలిపారు ఆమె. 25న దివ్యవిమాన రథోత్సవం, 26న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, 27న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తామన్నారు. రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు గీత.

Posted in Uncategorized

Latest Updates