రాష్ట్ర పోలీసులకు 17 మెడల్స్​

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి చెందిన 17 మంది పోలీసులను మెడల్స్​ వరించాయి. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (గ్రేహౌండ్స్​ అడిషనల్ డీఎస్పీ, హైదరాబాద్), టి. ప్రభాకర్ రావు (ఐజీపీ, హైదరాబాద్)లకు రాష్ట్రపతి విశిష్ట సేవ పోలీస్ పతకాలు వచ్చాయి. మెరిటోరియస్ సేవ పోలీస్​ విభాగంలో రమేశ్ మద్దుల (కమాండెంట్, హైదరాబాద్), మొహిద్ గోయబ్ మొహిద్దీన్ (ఏఎస్పీ, సైబరాబాద్), ఆర్. బాల రంగయ్య ( డీఎస్పీ, హైదరాబాద్), యార్లగడ్డ రాంబాబు (అసిస్టెంట్ కమాండెంట్, హైదరాబాద్), ఎ.వెంకట రామయ్య ( ఇన్స్​పెక్టర్, వరంగల్ అర్బన్), జి.మధుసూదన్ (ఏఎస్ఐ, హైదరాబాద్), ఎన్.హనుమంత్ గౌడ్ ( హెడ్​ కానిస్టేబుల్, హైదరాబాద్), టి.వెంకటేశ్వర్లు (హెడ్​ కానిస్టేబుల్, హైదరాబాద్)లకు.. ఫైర్ సర్వీస్ లో జి.వెంకట నారాయణరావు, ఎల్. దయాకర్, బి. మల్లికార్జున్ మాధవ్ లకు.. జైళ్ల విభాగంలో పి.భిక్షపతి ( చీఫ్ హెడ్​ వార్డెన్, చంచల్ గూడ), ఎస్.కృష్ణయ్య (హెడ్​ వార్డెన్, హైదరాబాద్)లకు సేవా పతకాలు దక్కాయి. ఆరుగురికి ఎక్సలెన్సీ పోలీస్ శిక్షణ పతకాలు వరించాయి.

Latest Updates