నేపాల్ రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా కొట్టడంతో 17 మంది చనిపోగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 8మంది మహిళలు ఉన్నారు. అర్ఘకాచి జిల్లాలోని సింధికార్క నుంచి రూపందేహీ జిల్లా కేంద్రానికి బయలుదేరిన బస్సు దారి మధ్యలో ప్రమాదానికి గురైంది. నిన్న సాయంత్రం ఘాట్ రోడ్డులో బయలు దేరిన బస్సు మార్గమధ్యలో అదుపు తప్పింది. బస్సును కంట్రోల్ చేయడంలో డ్రైవర్ విఫలం కావడంతో లోయలోకి బస్సు దూసుకు పోవడంతో పాటు బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణికులు ఎక్కువ మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన 10 మందిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Latest Updates