పోలింగ్ అధికారిగా 17 ఏళ్ల బాలుడు..స్పందించిన ఈసీ

హైదరాబాద్ : GHMC పోలింగ్ విధుల్లో 17 సంవత్సరాల బాలుడిని నియమించినట్లు… సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని తెలిపింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆ అబ్బాయిని వెబ్ క్యాస్టింగ్ నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రంలో నియమించామని తెలిపింది. వెబ్ క్యాస్టింగ్ కొరకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను మాత్రమే నియమించడం జరుగుతుందని వివరించింది. వీరికి వయస్సుతో సంబంధం లేదని.. ఆ కుర్రాడు మధ్యాహ్నం భోజనం చేసేందుకు మాత్రమే ఇతర పోలింగ్ సిబ్బందితో పాటు కూర్చోవడం జరిగిందని తెలిపింది. అంతేగాని ఆ అబ్బాయికి ఎన్నికల విధులు కేటాయించామనటంలో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది స్టేట్ ఎలక్షన్ కమిషన్.

Latest Updates