పొగమంచుతో 18 విమాన సర్వీసుల రద్దు

దేశ రాజధాని ఢిల్లీని పొగ మంచు కమ్మేసింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో 18 విమాన సర్వీసులను రద్దు చేశారు. పొగమంచు ప్రభావంతోపాటు వాతావరణం అనుకూలించక పోవడంతో 18 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీవర్షాలతో పాటు మంచు కురుస్తుండటంతో శ్రీనగర్ విమానాశ్రయానికి విమానాల రాకపోకలను రద్దు చేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో రన్ వేను మంచు కప్పేసింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 3.5 డిగ్రీలకు తగ్గింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మంచు కురవడంతో సిమ్లా, కుల్లూ జిల్లాల్లో పలు రోడ్లను మూసివేశారు అధికారులు.

 

Latest Updates