దంతెవాడ కలెక్టర్, ఎస్పీల ఎదుట లొంగిపోయిన 18 మంది మావోలు

అడవి బాట వీడి ఇంటి బాట పట్టారు మావోయిస్టులు. చత్తీస్ గఢ్ లో 18 మంది మావోలు తీవ్రవాదానికి స్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.  మావోయిస్టు అనుబంధ సంస్థలైన చేతన నాట్యమండలి, దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్‌ కు చెందిన 18 మంది మావోయిస్టులు… చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన అందరికీ టైలరింగ్, నిర్మాణ పనుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సీఆర్‌పీఎఫ్ డీఐజీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.  అంతేకాదు లొంగిపోయిన 18 మంది తలపై ఉన్న లక్ష రూపాయల రివార్డును వారికే ఇస్తామని చెప్పారు. మరోవైపు, మావోయిస్టు సీనియర్ కమాండర్‌ను అరెస్ట్ చేశామని, బుల్లెట్ గాయంతో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించినట్టు ఐటీబీపీ పోలీసులు తెలిపారు.

Latest Updates