మొబైల్‌‌ ఫోన్స్‌‌పై 18% జీఎస్టీ

ప్రొడక్ట్స్‌‌, తయారీ ఇన్‌‌పుట్‌‌లపై వేరువేరు రేట్లు
ఇన్‌‌పుట్‌‌క్రెడిట్‌‌ను క్లయిమ్‌‌ చేయడంలో ఇబ్బందులు
ఈ నెల 14న జీఎస్టీ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌

న్యూఢిల్లీ:  మొబైల్‌‌ ఫోన్స్‌‌, ఫెర్టిలైజర్స్‌‌‌‌, మ్యాన్‌‌మేడ్‌‌ ఫ్యాబ్రిక్స్‌‌, గార్మెంట్స్‌‌పై జీఎస్టీని  ప్రభుత్వం18 శాతానికి పెంచనుంది. ఈ నెల 14 న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ మీటింగ్‌‌లో జీఎస్టీ రేటు పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు.  ప్రస్తుతం  మొబైల్‌‌ ఫోన్స్‌‌పై 12 శాతం  జీఎస్టీని, కొన్ని కాంపోనెట్స్​పై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. ఫుట్‌‌వేర్‌‌‌‌కు సంబంధించి రూ. 1,000 లోపున్న వాటిపై జీఎస్టీని ప్రభుత్వం గతేడాది 5 శాతానికి తగ్గించింది. ఈ అమౌంట్‌‌ కంటే పైనున్న వాటిపై 18 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. వీటి తయారీలో ఉపయోగించే ఇన్‌‌పుట్స్‌‌పై 5 శాతం నుంచి 18 శాతం రేంజ్‌‌లో జీఎస్టీని వసూలు చేస్తున్నారు.  టెక్స్‌‌టైల్‌‌ సెక్టార్‌‌‌‌లో 5, 12,18 శాతం జీఎస్టీ రేటు ఉంది.  కెమికల్‌‌ ఫెర్టిలైజర్స్‌‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా, వీటీ ఇన్‌‌పుట్స్‌‌పై 12 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు.  ఇలా ప్రొడక్ట్స్‌‌పై, వాటి తయారీ ఇన్‌‌పుట్స్‌‌పై వేరు వేరు జీఎస్టీ రేట్లు అమలులో ఉండడంతో,  ఇన్‌‌పుట్‌‌ క్రెడిట్‌‌ను క్లయిమ్‌‌ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ–ఇన్‌‌వాయిసింగ్‌‌ వాయిదా పడనుంది..

జీఎస్టీ నెట్‌‌వర్క్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లో అవాంతరాలు ఏర్పడడంతో  ఏప్రిల్‌‌ నుంచి అమలుచేయాలని ప్లాన్‌‌ చేసిన రిటర్న్‌‌ ఫైలింగ్‌‌ సిస్టమ్‌‌, ఈ-–ఇన్‌‌వాయిసింగ్‌‌ వాయిదాపడే  అవకాశం కనిపిస్తోంది. జీఎస్టీ వచ్చి మూడేళ్ల అవుతన్న జీఎస్టీ నెట్‌‌వర్క్‌‌ పోర్టల్‌‌ ఇంకా స్టెబిలైజ్‌‌ కాకపోవడంతో  ఇన్ఫోసిస్‌‌ నుంచి రిజల్యూషన్‌‌ ప్లాన్‌‌ను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. కాగా జీఎస్టీ నెట్‌‌వర్క్‌‌ పోర్టల్‌‌కు బ్యాక్‌‌ ఎండ్‌‌ సపోర్ట్‌‌ను ఇన్ఫోసిస్‌‌ అందిస్తోంది.  వీటితోపాటు జీఎస్టీ కలెక్షన్‌‌ను పెంచడంపై కూడా కౌన్సిల్‌‌ చర్చించే అవకాశం ఉంది. జీఎస్టీ ఈ–వే బిల్‌‌ సిస్టమ్‌‌, ఎన్‌‌హెచ్‌‌ఏఐ ఫాస్టాగ్‌‌ మెకానిజమ్‌‌ను ఏప్రిల్‌‌ నుంచి కలపడంపై కౌన్సిల్‌‌ చర్చించే అవకాశం ఉంది. ఈ రెండు కలపడంతో గూడ్స్‌‌ మూవ్‌‌మెంట్‌‌ను ట్రాక్‌‌ చేయడంతో పాటు, జీఎస్టీని ఎగ్గోట్టేవాళ్లను గుర్తించడానికి వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Latest Updates