యువతిపై ఏడుగురి గ్యాంగ్ రేప్

నిందితుల్లో ముగ్గురు మైనర్లు
బేతుల్: పద్దెనిమిదేళ్ల ఓ అమ్మాయిపై ఏడు మంది అఘాయిత్యానికి పాల్పడిన ఘటన గురువారం మధ్యప్రదేశ్ లో జరిగింది. మోటార్ బైక్ పై ఒక అమ్మాయి తన సోదరుడితో కలసి స్వగ్రామానికి వెళ్తోంది. సరిగ్గా రాత్రి 8:30 గంటల టైమ్ లో వారిని ఏడుగురు దుండగులు అడ్డుకున్నారు. ఆ అమ్మాయి సోదరుడ్ని దగ్గర్లోని బావిలోకి నెట్టేశాక నిందితులు ఆమెపై బలాత్కారానికి తెగబడ్డారు. వారి బారి నుంచి బయటపడ్డాక బాధితురాలు తన సోదరుడ్ని బావిలో నుంచి బయటకు తీసి గ్రామానికి చేరింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. శుభం బేలే (22), సందీప్ ఖాతియా (23)తోపాటు మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ సోని (22), పవన్ బేలే (24) కోసం గాలిస్తున్నారు. ఐపీసీ సెక్షన్స్ 376 (రేప్), 365 (కిడ్నాపింగ్), 307 (హత్యాయత్నం) కింద కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

Latest Updates