కరోనా@ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌..20రోజుల్లోనే 180 మందికి పాజిటివ్

హైదరాబాద్, వెలుగు : సిటీలో కరోనా వైరస్​స్పీడ్​గా స్ప్రెడ్​ అవుతోంది. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌రిలాక్సేషన్స్​తో అన్ని ఏరియాలకూ వ్యాపించగా, ఖైరతాబాద్​ జోన్​లో ఎక్కువ కేసులు ఉంటున్నాయి. డైలీ వస్తున్న పాజిటివ్స్​లో 70 శాతం ఇక్కడివే. ముఖ్యంగా జియాగూడ ఏరియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న కేసుల్లోనూ ఇక్కడి లింకులు బయటపడుతున్నాయి. కరోనాకు కేరాఫ్‌‌‌‌‌‌‌‌గా మారిన ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌జోన్​లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ల సెర్చింగ్‌‌‌‌‌‌‌‌అధికారులకు తలనొప్పిగా మారింది. మార్చిలో కేసులు ఎక్కువగా చార్మినార్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌లో నమోదయ్యాయి. మర్కజ్‌‌‌‌‌‌‌‌వెళ్లొచ్చిన వ్యక్తులు, ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌కే పాజిటివ్​ వచ్చింది. ఈ జోన్‌‌‌‌‌‌‌‌లో మార్చి నుంచి మే నెలాఖరు వరకు 520 వరకు నమోదైతే, ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌లో 250దాకా కేసులున్నాయి. కేవలం 20 రోజుల్లోనే 180  పాజిటివ్‌‌‌‌‌‌‌‌లు వచ్చాయి. జియాగూడలోని దుర్గానగర్‌‌‌‌‌‌‌‌, సాయిదుర్గానగర్‌‌‌‌‌‌‌‌, వెంకటేశ్వర నగర్‌‌‌‌‌‌‌‌, సబ్జీమండి, గుడిమల్కాపూర్, లంగర్‌‌‌‌‌‌‌‌హౌస్​పరిధిలోనే 90శాతం కేసులున్నాయి. 115 కంటెయిన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌జోన్లు ఏర్పాటు చేశారు.

ప్రైమరీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌లే..

చార్మినార్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌లో సగటున డైలీ 8 నుంచి 10 కేసులు వస్తున్నాయి. అవన్నీ ప్రైమరీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌లే. ఈ జోన్‌‌‌‌‌‌‌‌పరిధిలో 120 దాకా యాక్టివ్‌‌‌‌‌‌‌‌కేసులున్నాయి. 80 కంటెయిన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌జోన్లు, హోమ్‌‌‌‌‌‌‌‌కంటెయిన్‌‌‌‌‌‌‌‌మెంట్లను ఏర్పాటుచేశారు. వాటికి సంబంధించి చాలామందికి కరోనా ఎలా సోకిందనే లింక్‌‌‌‌‌‌‌‌కూడా తెలియకపోవడం అధికారులకు సవాల్​గా మారింది. ప్రస్తుతం ప్రైమరీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌లతోనే వైరస్‌‌‌‌‌‌‌‌వ్యాప్తిని గుర్తిస్తున్నట్టు స్థానిక అధికారులు చెప్పారు. జియాగూడ నుంచి వైరస్‌‌‌‌‌‌‌‌వ్యాప్తి చెందిన సమయంలోనే లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌సడలింపులు ఇవ్వడంతో కమ్యూనిటీ స్ప్రెడ్‌‌‌‌‌‌‌‌అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Latest Updates