తెలంగాణలో కొత్తగా 1802 కేసులు..9 మంది మృతి

తెలంగాణలో  గడిచిన 24 గంటల్లో 1802 కరోనా కేసులు నమోదవ్వగా మరో తొమ్మిది మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,771 కు చేరగా మరణాల సంఖ్య 895 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 2711 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య రాష్ట్రంలో 1,10,241 కు చేరింది. ఇంకా 31,635 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 24,596 మంది హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. నిన్న 36,593 టెస్టులు చేయగా మొత్తం రాష్ట్రంలో టెస్టుల సంఖ్య  17,66,982 కు చేరింది. నిన్న నమోదైన కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 245 కేసులు నమోదయ్యాయి.

Latest Updates