186 దేశాల్లో పర్యటించాం…90 వేల మందిని రక్షించాం : సుష్మా

MAAకేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం(మే-28) మీడియాతో మాట్లాడారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్. కేంద్రమంత్రులు వీకే సింగ్, ఎమ్ జే అక్జర్ తో కలసి గడిచిన నాలుగేళ్లో విదేంశాగ శాఖ సాధించిన విజయాలపై బుక్ రిలీజ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దేశాలను ఇప్పటివరకూ మన నాయకులు సందర్శించలేదని విని తాను ఆశ్యర్యపోయానని, ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కలిగిన 192 దేశాలలో పర్యటించాలని, మంత్రిత్వ స్ధాయి చర్చలు ఆ దేశాలలో జరపాలని తాము నిర్ణయించామన్నారు. ఇప్పటికే తామ అధికారులు 186 దేశాలను సందర్శించినట్లు ఆమె తెలిపారు. వివిధ దేశాల్లో ఆపదల్లో చిక్కుకున్న 90 వేల మంది భారతీయులను రక్షించినట్లు తెలిపారు.

అనేక దేశాలలో పర్యటించిన ప్రధాని మోడీ అనేక మంది భారతీయులను స్థానిక శిక్షల నుంచి రక్షించారన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆమె తెలిపారు. పాకిస్థాన్‌ తో చర్చలకు సిద్ధంగా లేమని తామెప్పుడూ చెప్పలేదన్నారు. అయితే కొన్ని నిబంధనలు ఉన్నాయని, ఉగ్రవాదం, చర్చలు ఒక్కసారి కుదరవన్నారు. పాకిస్ధాన్ ఎప్పుడూ చరిత్రను వక్రీకరిస్తుందని, చట్టాన్ని నమ్మరని సుష్మా తెలిపారు. భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన విజయమాల్యా అప్పగింతపై స్పందించిన సుష్మా… భారతీయ జైళ్ల కండీషన్ సరిగ్గా లేదని బ్రిటన్ కోర్టులు ప్రశ్నిస్తున్నాయని, అయితే ఇవే జైళ్లలో గాంధీ, నెహ్రూ లాంటి ఎందరో నాయకులు జైలు శిక్ష అనుభవించారని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే కు ప్రధాని మోడీ చెప్పారని సుష్మా తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates