1,867 పోస్టులకు రేపు TSPSC పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆదివారం-అక్టోబర్ 7న పలు పోటీ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసినట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రకటించింది. ఆదివారం రోజున… గ్రూప్ 4, GHMCలోని బిల్ కలెక్టర్, బేవరేజెస్ కార్పొరేషన్ లోని లిమిటెడ్ పోస్టులు, TSRTCలోని జూనియర్ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలు జరగనున్నాయి.

ఈ పోటీ పరీక్షలతో 1వెయ్యి 867 పోస్టులు భర్తీ కానున్నాయి. 6 లక్షల 6వేల 579 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో 1వెయ్యి 46  ఎగ్జామ్ సెంటర్లు పెట్టారు. శనివారం నాటికి నాలుగు లక్షలకు పైగా అభ్యర్థులు  హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నట్టు TSPSC తెలిపింది.

గ్రూప్ 4 సర్వీసెస్ కింద 1,595 పోస్టులకు గాను 4, 35, 383 మంది దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీలో 124 బిల్ కలెక్టర్ పోస్టులకు 94వేల 179 మంది అప్లై చేశారు. బేవరేజెస్ కార్పొరేషన్ లో 76 పోస్టులకు 26, 494 మంది దరఖాస్తు చేశారు. ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 50,523 మంది అప్లై చేశారు.

Posted in Uncategorized

Latest Updates