తెలంగాణ‌లో మ‌రో 1879 క‌రోనా కేసులు.. ఏడుగురి మృతి

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ప్రతి రోజు భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 6,220 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 1879 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. అలాగే ఈ ఒక్క రోజే ఏడుగురు క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 27,613కి చేరింది. అలాగే క‌రోనా మృతుల సంఖ్య 313కి పెరిగింది. ఈ ఒక్క రోజులో భారీగా 1506 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 16,287కి చేరింది. ప్ర‌స్తుతం 11,012 మంది చికిత్స పొందుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా ‌గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 1422 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చ‌ల్‌లో 94, క‌రీంన‌గ‌ర్‌లో 32, న‌ల్ల‌గొండ‌లో 31 మంది చొప్పున‌ క‌రోనా బారిన ప‌డ్డారు.

Latest Updates