తెలంగాణలో కొత్తగా 1896 కేసులు..8 మంది మృతి

తెలంగాణలో  గడిచిన 24 గంటల్లో 1896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 338, రంగారెడ్డి 147, కరీంనగర్ లో 121 ,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో 119 కేసులు నమోదయ్యాయి. మరో  8 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 82,647 కు చేరగా మృతుల సంఖ్య 645కు చేరింది. నిన్న ఒక్కరోజే 1788 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 59,374 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 22,628 మంది  ఆస్పత్రిలో  చికిత్స తీసుకుంటున్నారు.  కరోనా రికవరీ రేటు ఇండియాలో 69.33 శాతం ఉండగా రాష్ట్రంలో 71.84శాతంగా ఉంది.

Latest Updates