19 గంటలు గాల్లోనే: సింగపూర్ ఎయిర్ లైన్స్ కొత్త రికార్డ్

సింగపూర్ ఎయిర్ లైన్స్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 16,700 కిలోమీటర్లు 19 గంటలు నాన్ స్టాప్ గా వెళ్లే ఎయిర్ సర్వీసుని ప్రారంభించింది. సింగపూర్ టైం ప్రకారం గురువారం రాత్రి 11:35 గంటలకు విమానం చాంగీ ఎయిర్ పోర్ట్ లో టేకాఫ్ అయింది. అలస్కా మీదగా వెళ్లి న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోవడంతో  రికార్డు సృష్టించనుంది.ఈ విమానంలో 161 మంది ప్రయాణించవచ్చు. 67 బిజినెస్ క్లాస్, 94 ప్రీమియం ఎకానమీ ప్యాసింజర్ సీట్లు ఉన్నాయి. రెగ్యూలర్ ఎకానమీ సీట్లు మాత్రం ఉండవు. ఇద్దరు పైలట్లు ఉంటారు. ఒక్కో పైలట్ కనీసం 8గంటలపాటు రెస్ట్ తీసుకొనే ఏర్పాట్లు చేశారు. మరో ఇద్దరు ఆఫీసర్లు, 13మంది సిబ్బంది పైలట్లకు సాయంగా ఉంటారు. విమానంలో రెండు ఇంజిన్లు ఉంటాయి. మిగతా చిన్న విమానాలతో పోల్చి చూసినా 25 శాతం తక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుందని ఎయిర్ బస్ తెలిపింది.

నిజానికి 2004లోనే సింగపూర్ ఎయిర్ లైన్స్ “ఎయిర్ బస్ ఏ340-500”ను నడపింది. ఇది 18 గంటల్లోనే న్యూయార్క్ చేరుకొనేది. ఇందులో అన్నీ బిజినెస్ క్లాస్ టిక్కెట్లు ఉండేవి. నాలుగు ఇంజిన్లతో విమానం పెద్దగా ఉంటుంది. ఫ్యూయల్ కూడా బాగా తాగుతుంది. దీన్ని నడపడం వల్ల లాభాలు రాకపోవడంతో 2013లో సర్వీసుని ఆపేసింది. ఏదేళ్ల తర్వాత ఇప్పుడు “ఏ350-900” అల్ట్రా లాండ్ రేంజ్ ఎయిర్ బస్ ను సింగపూర్ ఎయిర్ లైన్స్ లాంచ్ చేస్తోంది.

 

 

 

Posted in Uncategorized

Latest Updates