19 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీ : కేటీఆర్

minktr2202 హైదరాబాద్ లో 19 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో ప్రపంచంలోనే మన ఫార్మాసిటి అతి పెద్దది కానున్నదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం (ఫిబ్రవరి-22) నగరంలోని HICCలో బయో ఏషియా సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్, 50 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేటీఆర్… బయో సైన్స్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. లైఫ్ సైన్స్‌లో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. 10 వేలకు పైగా కంపెనీలు బయోసైన్స్ రంగంలో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ఆసియాలోనే అతి పెద్దదన్న కేటీఆర్… జీనోమ్ వ్యాలీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వందకు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయన్నారు. మన రాష్ట్రం అతి తక్కువ ధరకే వ్యాక్సిన్లను అందజేస్తున్నదని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణకు అగ్ర పథంలో నిలుపుతామని మంత్రి హామీ ఇచ్చారు.

ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచానికే లీడర్ గా మారుస్తామన్న కేటీఆర్.. తెలంగాణ నుంచి అతి తక్కువ ధరలకే …వాక్సిన్లను అందిస్తున్నామని.. 33 శాతం వ్యాక్సిన్లు తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు మంత్రి. రెండోరోజు ఫిబ్రవరి-23 సదస్సులో …సీఈఓ కాంక్లేవ్ సెషన్ జరగనుంది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సదస్సులో పాల్గొననున్నారు.

Posted in Uncategorized

Latest Updates