దొంగ చాటుగా కార్యకలాపాలు:19మంది టెక్కీలకు కరోనా వైరస్

19మంది టెక్కీలకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

కరోనా వైరస్ పై కేంద్రం జారీ చేసిన ఆదేశాల్ని కొన్ని ఐటీ కంపెనీలు పెడచెవిన పెడుతున్నాయి. ప్రధాని మోడీ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. కట్టడిలో భాగంగా మోడీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసింది. లాక్ డౌన్ తో ఇతర దేశాల కంటే మనదేశంలో కరోనా వైరస్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.

అయితే ప్రధాని పిలుపు మేరకు దేశ ప్రజలు లాక్ డౌన్ లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావడం లేదు. కానీ నేవీ ముంబై టీటీసీ ఎంఐడిసి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ చెందిన ఐటీ కంపెనీ  సీక్రెట్ గా తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తుంది.

ఐటీ కంపెనీ కార్యకలాపాలపై సమాచారం అందుకున్న అధికారులు ఉద్యోగులకు కరోనావైరస్ టెస్ట్ లు నిర్వహించారు.  ఆ టెస్ట్ ల్లో 19మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. వారిలో తెలుగురాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఉన్నారని, అత్యవసర చికిత్స కోసం బాధితుల్ని  ఎన్‌ఎంఎంసి ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పలు సంస్థలు లాక్ డౌన్ పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Latest Updates