మెక్సికోలో కాల్పుల మోత..19 మంది మృతి

మెక్సికోలో డ్రగ్స్ మాఫియాకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో  19 మంది మరణించగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు సామాన్య పౌరులు, నలుగురు పోలీస్ అధికారులు, మిగతా వారు డ్రగ్స్ ముఠా సభ్యులున్నట్లు అధికారులు వెల్లడించారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.  అమెరికా బార్డర్ టెక్సాస్‌లోని ఈగిల్ పాస్‌కు 40 మైళ్ల దూరంలో ఉన్న విల్లా యూనియన్ నగరంలోని ఓ బిల్డింగ్ లో ఈ కాల్పులు జరిగాయి. డ్రగ్స్ ముఠాకు పోలీసులకు మధ్య  ఒక గంట పాటు  కాల్పులు జరిగాయని అధికారులు చెప్పారు.  ఘటన స్థలం వద్ద పేలుడు పదార్థాలు, ఆయుధాలు, 14 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Latest Updates