అస్సాం సిటిజన్స్ ఫైనల్ లిస్ట్..19 లక్షల మంది మనవాళ్లు కాదు

అస్సాంలో 19 లక్షల మంది భారతీయులు కారని ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసింది నేషనల్‌‌ రిజిస్టర్‌‌ ఆఫ్‌‌ సిటిజన్స్‌‌ (ఎన్ ఆర్ సీ). అయితే ఎన్ఆర్ సీలో పేర్లు లేని వారిని విదేశీయులుగా ప్రకటించబోమని ప్రభుత్వం చెప్పింది.. పేరు లేని వారు విదేశీయుల ట్రిబ్యునల్స్ ముందు అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు ”అని ఎన్ఆర్సి రాష్ట్ర సమన్వయకర్త ప్రతీక్ హజేలా చెప్పారు. ఇందుకు 120 రోజుల గడువు ఉందని చెప్పారు. మొత్తం తుది ఎన్‌ఆర్‌సి జాబితా nrcassam.nic.in లో అప్‌లోడ్ చేయబడినప్పటికీ, ఎన్‌ఆర్‌సి సేవా కేంద్రాలు (ఎన్‌ఎస్‌కె) వద్ద ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

అస్సాంలో స్థిరపడ్డవారిలో ఎంతమంది మనవాళ్లు, ఎంతమంది అక్రమంగా దేశంలోకి చొరబడ్డారు అన్న ఇష్యూకి సంబంధించిన వివరాలతో ఫైనల్‌‌ డ్రాఫ్ట్‌‌ను ఈ ఏడాది జులై 30న రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. ఈ ఫైనల్‌‌ డ్రాఫ్టులో మూడు కోట్ల 29 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. సుమారు 41 లక్షల మంది దరఖాస్తుదారుల పేర్లు తొలగించారు. దీంతో ఎన్‌‌ఆర్సీ ఇవాళ శనివారం  ఫైనల్‌‌ లిస్ట్‌‌ను రిలీజ్ చేసింది.ఇందులో 19 లక్షల మంది భారతీయులు కారని ప్రకటించింది .

అస్సాంలో అక్రమంగా వచ్చి నవాళ్లను తిరిగి పంపించేయాలన్న డిమాండ్‌‌తో ఆల్‌‌ అస్సాం స్డూడెం ట్స్‌‌ యూనియన్‌‌ ఆరేళ్లపాటు ఉద్యమాన్నినడిపింది. అస్సాం ఒప్పందంపై సంతకంతో ఈ యూనియన్‌‌ 1985లో ఆందోళనను నిలిపేసింది. తర్వాత ఎన్‌‌ఆర్సీని అప్ డేట్‌‌ చేయాలని సుప్రీంకోర్టు 2013లోనే ఆదేశించినా.. నిజమైన ఎక్సర్‌‌ సైజ్‌ మాత్రం ఫిబ్రవరి 2015లోనే మొదలైంది.

Latest Updates