పరీక్షా పే చర్చలో మన స్టూడెంట్స్​ 19 మంది

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ మూడో ఎడిషన్​లో పాల్గొనే అవకాశం రాష్ట్రం నుంచి 19 మంది స్టూడెంట్స్​కు దక్కింది. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో సోమవారం ప్రారంభమయ్యే ఇంటరాక్షన్ మీటింగ్​లో స్టూడెంట్స్ అడిగే ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు ఇవ్వడంతోపాటు సూచనలు చేస్తారు. దేశవ్యాప్తంగా 2,200 మంది స్టూడెంట్స్​ పాల్గొంటారు. రాష్ట్రం నుంచి 19 మందిని ఎంపిక చేసి ఢిల్లీకి పంపినట్లు స్కూల్​ఎడ్యుకేషన్​ కమిషనర్ విజయ్​కుమార్​ తెలిపారు. తొమ్మిదో తరగతివారు ఏడుగురు, పదో తరగతి వారు నలుగురు, 11వ తరగతివారు  ఐదుగురు, 12వ తరగతి వారు ముగ్గురు ఉన్నారని వివరించారు. ఈ ప్రోగ్రాం దూరదర్శన్​, ఆకాశవాణి ద్వారా ప్రసారం జరుగుతుందని, రాష్ట్రంలోని అన్ని హైస్కూళ్లలోని స్టూడెంట్స్​ ఈ ప్రోగ్రాంను చూసేలా ఏర్పాట్లు చేయాలని డీఈవోలను ఆయన
ఆదేశించారు.

పరీక్షా పే చర్చలో పాల్గొనే మన స్టూడెంట్స్​వీరే…

గణేశ్​(కేవీ, కరీంనగర్​), సునీల్, బి.మహేశ్ (నవోదయ, నిజామాబాద్​), వర్షారెడ్డి, నందిని(ఎన్​టీఆర్ మోడల్​స్కూల్, రంగారెడ్డి), సౌమ్య(హిందూ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్​), ఐశిత( న్యూ క్రియేషన్ ఏ ఫ్రీ ప్రోగ్రెస్​ స్కూల్, జనగాం), బుష్రా ఖాటూన్ (కేవీ, గచ్చిబౌలి), సదక్​ హన్సిని(శ్రీభాషిత గ్రామర్ హైస్కూల్, నిజామాబాద్), అరవింద్, మురళి అజ్మీర​( నవోదయ, కరీంనగర్​), అఖిల( జడ్పీహెచ్​ఎస్​ మహాలింగాపురం, రంగారెడ్డి), బి.భౌమిక్ (కేవీ, రంగారెడ్డి), సాత్వికరెడ్డి(బాలాజీ టెక్నో స్కూల్, వరంగల్ రూరల్​), అభిషేక్ (నవోదయ, సిద్దిపేట), అక్షయ అంబటి (కెసిస్టన్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్​), మేఘన ( నవోదయ, వరంగల్), తరుణి గోపి (హిందూపబ్లిక్​ స్కూల్​, రంగారెడ్డి), హరిప్రియ (ఆక్స్​ఫర్డ్ గ్రామర్ స్కూల్, హైదరాబాద్).

For More News..

కారులో 400 రోజులు.. లక్ష కిలోమీటర్లు..

గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి..

Latest Updates