సూపర్ మార్కెట్ కెళ్లిన యువతి అదృశ్యం

హైదరాబాద్ : 19 ఏళ్ల యువతి అదృశ్యమైన సంఘటన గురువారం హైదరాబాద లో జరిగింది. దుండిగల్‌ లోని మల్లంపేట్‌కు చెందిన గాయత్రి(19) తను పనిచేసే సూపర్‌ మార్కెట్‌కు వెళ్తున్నానని బుధవారం మధ్యాహ్నాం ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగిరాలేదు.

దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఎక్కడా యువతి ఆచూకి లభించకపోవడంతో గురువారం దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates