జమ్మూకశ్మీర్: రీస్టార్ట్ అయిన 190 స్కూళ్లు

జమ్మూకశ్మీర్ లో  ఆంక్షలు  సడలిస్తూ  వస్తున్నారు  అధికారులు.  శ్రీనగర్ లో  ఇవాళ  190  స్కూళ్లను  తిరిగి  ప్రారంభించారు.  విద్యార్థులంతా.. మళ్లీ  బడి బాట  పట్టారు.  స్టూడెంట్స్  అంతా  పుస్తకాలతో  బిజీ  అయిపోయారు. ఇప్పటివరకు  మొత్తం  85 పోలీస్ స్టేషన్ల పరిధిలో  ఆంక్షలు  ఎత్తివేశారు.  కశ్మీర్  లోయలో  ఇవాళ్టి  నుంచి  పూర్తి  స్థాయిలో  ప్రభుత్వ  ఆఫీసులు అందుబాటులోకి  వచ్చాయి.

మరోవైపు  ల్యాండ్  లైన్  సేవలు  పూర్తిగా  అందుబాటులోకి  తెచ్చేందుకు  ప్రభుత్వం  ప్రయత్నిస్తోందన్నారు  రోహిత్ కన్సల్.  బీఎస్ఎన్ఎల్  అధికారులు,  సిబ్బంది.. విరామం  లేకుండా  పనిచేస్తున్నారని  తెలిపారు. కశ్మీర్ లో  మౌలిక వసతుల  కల్పన,  అభివృద్ధి  పనులను  ప్రభుత్వం  పునరుద్ధరిస్తుందన్నారు  కన్సల్.  శాంతిభద్రతలు  కాపాడేందుకే.. రాష్ట్రంలో  ఆంక్షలు  విధించామన్నారు  కశ్మీర్  గవర్నర్  సలహాదారు  విజయ్  కుమార్.  సమాచార  మార్పిడి దుర్వినియోగం  కాకుండా  ఫోన్లు,  ఇంటర్నెట్ ను  నియంత్రించామని  చెప్పారు.

Latest Updates