కింగ్ ను చూసి వెనక్కు తగ్గిన రిచర్డ్స్‌

1979 World Cup final: When Collis King outhit Viv Richards

వెస్టిండీస్‌ క్రికెట్‌ గ్రేట్‌ వివ్‌ రిచర్డ్స్‌ దూకుడైన బ్యాటింగ్‌ కు మారుపేరు. కరీబియన్ల ఆధిపత్యం నడిచిన తొలినాళ్లలో రిచర్డ్స్‌ ను చూస్తేనే ప్రత్యర్థి వెన్నులో వణుకుపుట్టేది. అలాంటి వివ్‌ ..తన సహచర ఆటగాడి బ్యాటింగ్‌ పదును చూసి ఓసారి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. 1979 వరల్డ్‌ కప్‌ లో ఇంగ్లండ్‌ తో జరిగిన ఫైనల్లో ఈఘటన జరిగింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ గా, ఫేవరెట్‌ గా తుదిపోరులో బ్యాటింగ్‌ కు వచ్చినవిండీస్‌ ఆరంభంలోనే తడబడింది. ఇంగ్లండ్‌ టీమ్‌ గాయపడ్డ స్టార్‌ పేసర్‌ బాబ్‌ విల్లిస్‌ సేవలు కోల్పో యినా.. క్రిస్‌ ఓల్డ్‌ , మైక్‌ హెండ్రిక్‌ టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్న తమ కెప్టెన్‌ నిర్ణయానికి న్యాయం చేశారు.

డెస్మండ్‌ హేన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్లైవ్‌ లాయిడ్‌ ,అల్వి న్‌ కాళి చరణ్‌ ను త్వరగానే ఔట్‌ చేయగా..గోర్డన్ గ్రీనిడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రనౌటవడంతో విండీస్‌ 99/4తోకష్టాల్లో పడింది. అప్పటికి రిచర్డ్స్‌ 22 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోక్రీజులో ఉన్నాడు. కొలిస్‌ కింగ్‌ , వికెట్‌ కీపర్‌ డెరిక్‌మర్రే తప్పితే మిగతా వాళ్లు టెయిలెండర్లే. దాంతో,తనకు సహకారం అందిస్తూ జాగ్రత్తగా ఆడాలని ఆరో నెం బర్‌ లో బ్యాటింగ్‌ కు వచ్చిన కింగ్‌ కు రిచర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించాడు. చాలా ఓవర్లు మిగిలున్న నేపథ్యం లో క్రీజులో కుదురుకోమని చెప్పా డు. కానీ, కొలిస్‌ కింగ్‌ వేరే ఐడియాతో ఉన్నాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జెఫ్రీ బాయ్‌ కాట్‌ ఎట్టి పరిస్థి తుల్లోనూ వరల్డ్‌ కప్‌ పై చెయ్యి వేయకూడదనుకున్నాడు.అంతే.. వివ్‌ మాటను పెడచెవిన పెట్టేసి ఇయాన్‌ బోథమ్‌ బౌలింగ్‌ లో ఎదుర్కొన్న తొలి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే కట్‌ షాట్‌ తో బౌండ్రీ కొట్టా డు. ఆశ్చర్యపోవడం రిచర్డ్స్‌ వంతైం ది. అయినా సరే.. ప్రత్యర్థి బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా కొలిస్‌ కింగ్‌ అదే జోరుతో చెలరేగిపోయాడు.

దాంతో, రిచర్డ్సే కాస్త జోరు తగ్గించి అతడికి సహకారం అందించాడు. 66 బంతుల్లోనే 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 86రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన కింగ్‌ ఐదో వికెట్‌ కు వివ్‌ తో 139పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.చివరకు రిచర్డ్స్‌ (158 బంతుల్లో 138 నాటౌట్‌ ) అజేయ సెం చరీతో నిలిచినా … మ్యా చ్‌ లో కింగ్‌ ఇన్నింగ్సే ఫలితాన్ని ప్రభావితం చేసింది. ఈమ్యా చ్‌ లో269 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన విండీస్‌ .. ఛేజింగ్‌ లోఇంగ్లండ్‌ ను 194కే ఆలౌట్‌ చేసి వరుసగా రెండోసారి కప్‌ నెగ్గింది.

Latest Updates