1984 సిక్కుల ఊచకోత కేసు..సజ్జన్ కుమార్ కు యావజ్జీవం

ఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుపై ఢిల్లీ హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ ను దోషిగా  తీర్పు వెల్లడించింది. సజ్జన్ కుమార్ నిర్దోషి అని గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. సజ్జన్ కుమార్ కు జీవితఖైదు విధించింది. డిసెంబర్ 31లోపు లొంగిపోవాలని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది. ట్రయల్ కోర్ట్ తీర్పుపై బాధితులు, సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.

సీబీఐ సహా అల్లర్ల బాధితుల వాదనలను ఎస్ మురళీధర్, వినోద్ గోయెల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విన్నది. అల్లర్లకు ప్రేరేపించడం, కల్లోలాలు సృష్టించేందుకు సజ్జన్ కుమార్ వ్యూహాలు రచించారని సీబీఐ వాదించింది. ప్రత్యక్ష సాక్షులు సజ్జన్ కుమార్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 3 వేల మంది మరణించారు. ఇందులో ఎక్కువ మంది సిక్కు కమ్యూనిటికి చెందిన వారు. సజ్జన్ కుమార్ 3 సార్లు కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించింది. అటు ఢిల్లీ హైకోర్టు తీర్పుపై బాధితులు హర్షం వ్యక్తం  చేశారు. ఇన్నాళ్లకు న్యాయం జరిగిందన్నారు.

Posted in Uncategorized

Latest Updates