19న రాష్ట్ర బంద్, 21న ప్రగతి భవన్ ముట్టడి

రాష్ట్ర వ్యాప్తంగా  ఆర్టీసీ సమ్మె  కొనసాగుతోంది. సమ్మెలో  భాగంగా 13వ రోజు… ధూం ధాం  కార్యక్రమం నిర్వహించనున్నారు  RTC జేఏసీ నేతలు.. ర్యాలీలు,  నిరసనలు , ధర్నాలతో  సమ్మెను  ఉధృతం చేస్తున్నారు  కార్మికులు. మరోవైపు  ఆర్టీసీ జేఏసీకి  అన్ని సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.  సమ్మె కోసం  ఉద్యోగ, టీచర్  సంఘాలు  ఏకం కావాలని పిలుపునిచ్చారు  నేతలు. మరో వైపు 19న  బంద్ ను  సక్సెస్ చేయాలని  పిలుపునిచ్చింది  అఖిలపక్షం. కార్మికులను చర్చలకు  పిలవాలని  డిమాండ్ చేశారు  నేతలు. మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్  ముట్టడికి  రెడీ అవుతోంది  ఓయూ జేఏసీ. మరోవైపు ఇవాళ  హుజుర్ నగర్ లో  సీఎం కేసీఆర్  సభలో నిరసన  తెలపాలని పిలుపునిచ్చింది   ఆర్టీసీ జేఏసీ. అటు  21న సీఎం క్యాంప్  కార్యాలయం ముట్టడికి  కాంగ్రెస్  సిద్దమౌతుంది.

Latest Updates