దంచికొట్టిన కివీస్: భారత్ కి భారీ టార్గెట్

ఆక్లాండ్: 5 టీ20ల సిరీస్ లో భాగంగా శుక్రవారం ఆక్లాండ్ వేదికగా భారత్ తో జరుగుతున్న ఫస్ట్ టీ20లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ కు ఛాలెంజింగ్ టార్గెట్ ఇచ్చారు కివీస్ ప్లేయర్లు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 రన్స్ చేసింది. న్యూజిలాండ్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు గప్టిల్, మున్రో రెచ్చిపోయి ఆడారు. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 68 రన్స్ చేశారు. ఆ తర్వాత గప్టిల్ ఔట్ అయినప్పటికీ మున్రో సిక్సర్లు, బౌండరీలతో రాణించాడు. ఈ క్రమంలోనే మున్రో(59) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్( హాఫ్ సెంచరీ- 51), రాస్ టేలర్ చెలరేగడంతో బిగ్ స్కోర్ చేసింది న్యూజిలాండ్.

కివీస్ ప్లేయర్లలో.. మున్రో(59), గప్టిల్(30), విలియమ్సన్(51), టేలర్(54), సాన్‌ట్నర్(2) గ్రాండ్‌హోమ్(0),  సీఫెర్ట్(1),

భారత బౌలర్లలో..జడేజా, ఠాకూర్, దూబె, చాహాల్, బుమ్రా తలో వికెట్ తీశారు.

 

Latest Updates