సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు మొదటి ప్రయాణికుల రైలు

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇవాళ(బుధవారం, మే-13) మొదటిసారిగా ప్రయాణికుల రైలు సికింద్రాబాద్‌కు రానుంది. రాత్రి 8:30 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరిన బెంగళూరు ఢిల్లీ (రాజధాని) ఏసీ సూపర్ ఫాస్ట్ రైలు సికింద్రాబాద్ చేరుకోనుంది. తర్వాత బయలుదేరి రేపు(గురువారం) తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటుంది. లాక్‌డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయిన దాదాపు 200 మంది తెలంగాణ ప్రజలు ఈ రైలులో సికింద్రాబాద్ చేరుకోనున్నారు. మరోవైపు… తెలంగాణలో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది ప్రయాణికులు ఢిల్లీ వైపుగా ప్రయాణించనున్నారు. ఇక ఢిల్లీలో నిన్న(మంగళవారం,మే-12) రాత్రి 9:15 గంటలకు బయలుదేరిన మరో రైలు  ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్ చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు.

Latest Updates