ఇంకా దాచిపెట్టుకున్నారా : రూ.2కోట్ల పాత నోట్లు పట్టివేత

puపెద్దనోట్లు రద్దు అయి 20 నెలలు గడుస్తున్నా ఏదో ఒక చోట ఇంకా పాత కరెన్సీ పట్టుబడుతూనే ఉంది. రూ.2 కోట్ల విలువైన పాత 500, 1000 రూపాయల నోట్లను ముగ్గురు వ్యక్తుల నుంచి థానే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు వ్యక్తులు రద్దయిన నోట్లను పారవేసేందుకు థానే జిల్లాలోని కల్వా టౌన్ లోని పార్శిక్ రీటీ బండర్ దగ్గర ఉన్నఓ గార్డెన్ దగ్గరకు వస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. బయటివ్యక్తుల నుంచి వచ్చిన సమాచారంతో నిఘూ పెట్టిన పోలీసులు.. నోట్లను పారవేసేందుకు అక్కడికి వచ్చిన ముగ్గురుని అరెస్ట్ చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కల్వా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

వారికి ఇంతపెద్ద మొత్తంలో పాత నోట్లు ఎలా వచ్చాయన్న దానిపై విచారణ జరుపుతున్నారు. 2016, నవంబర్-8న 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ కొంత మంది నోట్లు మారుస్తూ పట్టుబడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. పాత నోట్లు రద్దు అయ్యి రెండేళ్లు కావొస్తుంది.. ఇంకా ఆ నోట్లను పెట్టుకోవటం, మార్పిడి చేస్తామంటూ ముఠాలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని పోలీసులు సైతం అంటున్నారు. అప్పట్లో ఇంత పెద్ద మొత్తంలో మార్చుకోవటానికి వీలుకాక కొందరు అలాగే విదిలేశారని.. ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి మరో అవకాశం ఇస్తుందని నమ్మి.. కొంత మంది అలాగే దాచుకున్నారని చెబుతున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates