ధోనీ ఈజ్ బ్యాక్ : 2 సిరీస్ లకు ఎంపిక

న్యూఢిల్లీ : టీమిండియా క్రికెటర్ మిస్టర్ కూల్ ధోనీ చాలా రోజుల తర్వాత బ్యాటు పట్టేందుకు రెడీ అవుతున్నాడు. విండీస్‌, ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లకు దూరమైన సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని.. రెండు సిరీస్‌లకు సెలక్ట్ అయ్యాడు.

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు సోమవారం వేర్వేరుగా భారత జట్లను ప్రకటించింది BCCI. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది.

న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సెలక్ట్ చేసిన 15 మందితో కూడిన జట్టులోకి మహీ వచ్చేశాడు. మేలో మొదలయ్యే వరల్డ్ కప్ నాటికి వన్డేలు తక్కువ ఉండటంతో..  ఇప్పటికే జట్టుపై ఓ అంచనాకు వచ్చిన సెలెక్టర్లు.. మహీని తిరిగి టీ20లకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

టీమ్స్ వివరాలు ఇలా..

ఆస్ట్రేలియా- భారత వన్డే టీమ్

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ షమీ

న్యూజిలాండ్‌- భారత టీ20 టీమ్

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, దినేశ్‌ కార్తీక్‌, రిషభ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌.

Posted in Uncategorized

Latest Updates