‘2.0’ను VFX వండర్ గా మార్చింది వీళ్లే.. మేకింగ్ వీడియో రిలీజ్

ముంబై : రజినీ-అక్షయ్- శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత భారీ సినిమా ‘2.0’ కు సంబంధించిన నాలుగో మేకింగ్ వీడియో విడుదలైంది. ‘2.0’ కోసం తాము ఎంత కష్టపడ్డామో చూడండి అంటూ గాంధీ జయంతి సందర్భంగా సినిమా యూనిట్.. మేకింగ్ ఆఫ్ 2.0 పార్ట్ 4 ను సోషల్ మీడియాలో చేశారు. ‘2.0’ సినిమా మేకింగ్ కోసం… అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీన్స్ నిపుణులు… కొరియోగ్రాఫర్లు.. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్ పర్ట్స్ పనిచేశారని.. వాళ్ల వివరాలను ఈ వీడియోతో అందరికీ పరిచయం చేశారు.

‘2.0’ కోసం.. 25 వీఎఫ్ఎక్స్ సంస్థలు పనిచేశాయి. 2150 వీఎఫ్ఎక్స్ షాట్స్ తీశారు. వెయ్యి మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేశారు. నేటివ్ 3 డీ, యానిమేట్రోనిక్స్, 13వందల ప్రి విజ్ షాట్స్, వెయ్యి కాంప్లెక్స్ వీఎఫ్ఎక్స్ షాట్స్, వీ క్యామ్ టెక్నాలజీ, స్పైడర్ క్యామ్ సిస్టమ్స్, లైడార్ స్కానింగ్ లను ఉపయోగించారు.

‘2.0’ సినిమా తయారీలో.. 10 మంది కాన్సెప్ట్ ఆర్టిస్టులు, 25 మంది త్రీడీ డిజైనర్స్, ఐదు వందల మంది క్రాఫ్ట్ మెన్ భాగమయ్యారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న… యానిమెట్రోనిక్స్, కాస్ట్యూమ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ టీమ్స్ ‘2.0’ మేకింగ్ లో పాలు పంచుకున్నారు. నలుగురు ప్రముఖ యాక్షన్ డైరెక్టర్లు, ప్రపంచవ్యాప్తంగా 3వేల మంది వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్… మహాకావ్యం లాంటి భారీ సినిమాను తీసేందుకు అన్ లిమిటెడ్ ఎఫర్ట్ పెట్టారని సినిమా యూనిట్ తెలిపింది.

 

 

 

Posted in Uncategorized

Latest Updates