2.0 రికార్డ్ .. రూ.700 కోట్లు వసూలు చేసిన చిట్టీ

 సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 29 న విడుదలై భారీ వసూళ్లను రాబడుతుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటించారు. సైంటిఫిక్‌ ఫిక్షన్‌ గా తెరకెక్కిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినా.. వసూళ్లలో మాత్రం సత్తాను చాటుతుంది. విడుదలైన రెండు వారాల్లో రూ.700 కోట్లను వసూలు చేసింది. దీంతో పాటే 700 కోట్లు వసూలు చేసిన తొలి కోలీవుడ్ సినిమాగా రికార్డులకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్నటివరకు రూ 710.98 కోట్లు వసూలు చేసిందని, రెండు వారాల్లో తమిళనాడులో రూ.166 కోట్లు రాబట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ తెలిపారు.  ఇప్పటికీ.. అమెరికాలో 2.ఓ వందకు పైగా థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates