2.0 న్యూ రికార్డ్.. రూ.500కోట్ల వసూళ్లు

రజినీ-అక్షయ్ కుమార్- శంకర్-ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రెండోవారంలోకి ఎంటర్ అయిన 2.0 అప్పుడే ప్రపంచవ్యాప్తంగా రూ.ఐదు వందల కోట్లను కొల్లగొట్టింది. కొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తోంది. నమ్మశక్యంకాని వసూళ్లతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా 2.0 సినిమా నిలిచిందని చిత్రయూనిట్ అంటోంది. విదేశాల్లో ఈ సినిమాను ఇంతకుముందెన్నడూ ఏ భారతీయ సినిమాను రిలీజ్ చేయనంత ఎక్కువ స్క్రీన్స్ లో విడుదల చేశారు. తొలి ఐదురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 2.0 సినిమా నాలుగు వందల కోట్లను వసూలు చేసింది.

చైనాకు వెళ్తున్న 2.0… భారీ సంఖ్యలో థియేటర్లు

చైనాలోనూ… 47వేలకు పైగా థియేటర్లలో 3డీ ఫార్మాట్ లో రోబో సీక్వెల్ సినిమాను ప్రదర్శించబోతున్నారు. చైనాలో వచ్చే వసూళ్లతో… మరిన్ని రికార్డులు క్రియేట్ చేయొచ్చని ఇండస్ట్రీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. హిట్ టాక్ వస్తే.. ఈ సినిమా రికార్డుల దుమ్ము దులపడం ఖాయం.

Posted in Uncategorized

Latest Updates