కరోనాతో 2.5 కోట్ల జాబ్స్ పోతయ్!

యునైటెడ్ నేషన్స్ హెచ్చరిక

యునైటెడ్ నేషన్స్, వాషింగ్టన్: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని యునైటెడ్ నేషన్స్ (యూఎన్) హెచ్చరించింది. అయితే అంతర్జాతీయ సమన్వయంతో కూడిన ‘పాలసీ’ రెస్పాన్స్ వల్ల నిరుద్యోగంపై ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్​వో) ‘కొవిడ్–19, వరల్డ్ ఆఫ్ వర్క్: ఇంపాక్ట్స్, రెస్పాన్సెస్’ పేరుతో ప్రిలిమినరీ అసెస్​మెంట్ రిపోర్టును విడుదల చేసింది. పనిచేసే చోట కార్మికులను రక్షించడం.. ఎకానమీ, ఎంప్లాయ్​మెంట్​ను స్టిములేట్ చేయడం.. జాబ్స్, ఇన్‌కమ్స్​కు సపోర్ట్ ఇవ్వడం.. వంటి అత్యవసర, సమన్వయ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అలాగే సోషల్ ప్రొటెక్షన్ పెంచాలని, ఎంప్లాయ్​మెంట్ నిలబడేందుకు మద్దతు ఇవ్వాలని కోరింది. అలాగే మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్​ప్రైజెస్​కు ఫైనాన్షియల్ సపోర్ట్, ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వాలని సూచించింది.

‘ఎమర్జెన్సీ ప్యాకేజీ’పై ట్రంప్ సంతకం

మల్టీ బిలియన్ డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజీ చట్టంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. కరోనా వైరస్ వల్ల ఎదుర్కొంటున్న ప్రతికూల ఆర్థిక ప్రభావాన్ని తగ్గించేందుకు, అమెరికన్లకు సాయపడేందుకు ఈ చట్టం తీసుకొచ్చారు. ‘ఫ్యామిలీస్ ఫస్ట్ కరోనావైరస్ రెస్పాన్స్ యాక్ట్’ అని పిలిచే ఈ బిల్లులో.. పెయిడ్ సిక్​లీవ్స్, ఉచిత కొవిడ్–19 పరీక్షలు వంటివాటిని పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగ బీమా, ఆహార సహాయం, మెడిక్ ఎయిడ్ కోసం ఫెడరల్ నిధులను పెంచనున్నారు. ‘‘ఈ రోజు నేను చట్టంపై సంతకం చేశాను. వైరస్​పై పోరాడేందుకు అత్యవసర అనుబంధ కేటాయింపులు చేసేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది’’ అని ట్రంప్ చెప్పారు. వైరస్ ద్వారా ప్రభావితమైన అమెరికన్ కుటుంబాలు, వ్యాపారాలకు అవసరమైన మద్దతు ఈ చట్టం ద్వారా అందుతుందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

ఇద్దరు అమెరికా కాంగ్రెస్ సభ్యులకు కరోనా

అమెరికాలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులకు కరోనా వైరస్‌‌ సోకింది. రిపబ్లికన్‌‌ నేత మారియో డియాజ్‌‌ బలార్ట్‌‌, డెమోక్రటిక్‌‌ నేత బెన్‌‌ మెక్‌‌ ఆడమ్స్‌‌కు పరీక్షలు చేయగా కొవిడ్ –19 పాజిటివ్ వచ్చింది. ఫ్లోరిడాకు చెందిన మారియో డియాజ్‌‌.. కరోనా సోకిన తొలి కాంగ్రెస్ నేత. ఆయన జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నారు. బుధవారం (అక్కడి టైం ప్రకారం) నిర్వహించిన టెస్ట్​లో పాజిటివ్ వచ్చింది. దీంతో వాషింగ్టన్‌‌ డీసీలో ఉన్న తన అపార్ట్‌‌మెంట్‌‌లో క్వారెంటైన్‌‌ అయినట్లు డియాజ్‌‌ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని ఉటాకు చెందిన బెన్‌‌మెక్‌‌ ఆడమ్స్‌‌ చెప్పారు. ‘‘శనివారం సాయంత్రం నేను వాషింగ్టన్ నుంచి వచ్చినప్పుడు జలుబు చేసింది. తర్వాత మరింత తీవ్రమైంది. జ్వరం, పొడి దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డా. దీంతో సెల్ఫ్ క్వారంటైన్​లో ఉన్నా’’ అని వివరించారు. ఇద్దరూ చికిత్స తీసుకుంటున్నారు. ఆడమ్స్, బలార్ట్ అనారోగ్యంగా ఉన్నారని, అయితే మంచి కండీషన్​లోనే ఉన్నారని స్పీకర్ నాన్సీ పెలోసీ చెప్పారు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

Latest Updates