ఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 20 వేల 565 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 17 మంది కరోనా మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 79లక్షల 46వేల 860 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 84,401 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2886 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 6,676 మంది మృతి చెందారు. గ‌డిచిన 24 గంట‌ల్లో కృష్ణాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, విశాఖపట్టణంలలో ఇద్దరి చొప్పున చనిపోయారు. తూర్పుగోదావరి, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు.

Latest Updates