2.9 కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాల అపహరణ

శాన్‌ఫ్రాన్సిస్కో: 2.9 కోట్ల మంది వ్యక్తిగత ఖాతాల సమాచారం గత నెల హ్యాకర్లు దొంగిలించినట్లు తెలిపింది ఫేస్‌బుక్‌. వాస్తవానికి 5 కోట్ల మంది వివరాలు అపహరణకు గురై ఉండొచ్చని ఇంతకుముందే అంచనా వేసింది ఫేస్‌బుక్‌. ఊహించిన దానికంటే తక్కువమందిపైనే సైబర్‌దాడి ప్రభావం చూపిందని తెలిపారు ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు(ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌) గై రోసెన్‌. ఒకసారి ఖాతాలోకి లాగిన్‌ అయ్యాక లాగౌట్‌ చేసి, మళ్లీ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేయకుండానే పాత వివరాలతో ఖాతాను తెరవడానికి ఉపయోగపడే ‘యాక్సెస్‌ టోకెన్ల’ను దొంగిలించడమే ధ్యేయంగా గత నెల సైబర్‌దాడులు జరిగాయని చెప్పారు గై రోసెన్‌.

Posted in Uncategorized

Latest Updates