నేడు, రేపు భారీ వర్షాలు

నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్‌లో 60 మి.మీ. వర్షం

హైదరాబాద్‌, వెలుగు:ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత తీవ్రంగా మారి రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం రాష్ట్రంలోని అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. పొద్దంతా ఆకాశం మేఘావృతమైంది. నిర్మల్‌ జిల్లాలోని పాత ఎల్లాపూర్‌లో అత్యధికంగా 60.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. కరీంనగర్‌లోని అర్నకొండలో 48 మి.మీ. వెదురుగట్టు 44, జగిత్యాలలోని కత్లాపూర్‌లో 40.3 మిల్లీమీటర్ల రెయిన్‌ఫాల్‌ నమోదైంది.

Latest Updates