ఢిల్లీలో భవనం కూలి ఇద్దరి మృతి

నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని సీలంపూర్ లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఆరుగురుని రక్షించి వారిని ఆస్పత్రికి తరలించారు.మరి కొందరు శిధిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

 

Latest Updates