మందు దొరక్క స్పిరిట్ తాగిన్రు

ఇద్దరు యువకుల మృతి
భువనగిరి, వెలుగు: లాక్ డౌన్ కారణంగా మందు లేక పిచ్చెక్కి పోతున్నారు మందు బాబులు. తాజాగా స్పిరిట్ లో వాటర్ కలుపుకొని తాగిన ఇద్దరు యువకులు పరిస్థితి విషమించి మరణించారు. యాదాద్రి భువనగిరి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి, హౌసింగ్ బోర్డు కాలనీ ఎదురుగా కొన్ని కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాయి.

అక్కడ ఉంటున్న రియాజ్(21), షేక్ బాబా(35) మంగళవారం మధ్యాహ్నం స్పిరిట్లో వాటర్ కలుపుకొని తాగారు. తీవ్ర కడుపు నొప్పి రావడంతో వెంటనే కుటుంబీకులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో డాకర్లు హైదరాబాద్ ఉస్మానియాకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు.

Latest Updates