కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్  కాలనీ దగ్గర రాజీవ్ రహదారిపై  రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళుతున్న కారు  ముందున్న వాహనాన్ని ఢీకొంది.  దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Updates