పార్లమెంట్​ కాంప్లెక్స్ లో కరోనా కలకలం

  • డైరెక్టర్ స్థాయి అధికారికి వైరస్
  • రెండు ఫ్లోర్లు మూసివేత

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు కాంప్లెక్స్ లో ఒక సీనియర్ అధికారికి కరోనా సోకిన ఘటన కలకలం రేపింది. రాజ్యసభ సచివాలయ డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరికి వైరస్ పాజిటివ్ కన్ఫామ్ అయిందని.. దీంతో పార్లమెంట్ సచివాలయ బిల్డింగ్​ రెండు ఫ్లోర్లను మూసివేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇప్పటికే పార్లమెంట్ కాంప్లెక్స్ లో ముగ్గురు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. తాజా కేసుతో పార్లమెంట్ సచివాలయ ఉద్యోగులలో కరోనా సోకిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. గురువారం డ్యూటీకి హాజరైన డైరెక్టర్ స్థాయి అధికారికి తన కుటుంబ సభ్యుల ద్వారా కరోనా వచ్చినట్లు గుర్తించారు.

Latest Updates