కొవిడ్ దెబ్బకు రూ. 2 లక్షల కోట్ల నష్టం..

కొవిడ్–19 దెబ్బకు ఆసియా పసిఫిక్ రీజియన్​లో అన్ని ఎయిర్ లైన్లకు కలిపి 27.8 బిలియన్ డాలర్ల (రూ. 2 లక్షల కోట్లు) మేర నష్టం వస్తుందని అంచనా వేసినట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. కొవిడ్​ కారణంగా ఈ ఏడాది మొత్తంగా ఆసియా పసిఫిక్​లో ప్యాసింజర్ల సంఖ్య 13 శాతం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్​కు బలైనవారి సంఖ్య 2,236కు పెరిగింది. మొత్తం 75,465 మందికి వైరస్ సోకింది. వుహాన్ లోని ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్ పెంగ్ యిన్హువా (29) కూడా చనిపోయారు.

ఇండియన్లు కోలుకుంటున్నరు..

జపాన్​ నౌక డైమండ్ ప్రిన్సెస్​లో కొవిడ్​ ట్రీట్​మెంట్ తీసుకుంటున్న 8 మంది ఇండియన్లు కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఈ షిప్ లో 138 మంది ఇండియన్లు ఉండగా, మిగతా వారు ఆరోగ్యంగా ఉన్నారన్నారు.

 

Latest Updates