హెచ్ 1 బీ వీసా హోల్డర్స్ కు కష్టాలు !

  • జూన్ చివరి నాటికి 2 లక్షల మంది లీగల్ స్టేటస్ గడువు ముగింపు

వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1 బీ వీసా హోల్డర్స్ కు కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం అమెరికా లో ఉన్న రెండున్నర లక్షల మంది హెచ్ 1 బీ వీసా హోల్డర్లలో 2 లక్షల మంది జూన్ చివరి నాటికి లీగల్ స్టేటస్ కోల్పోనున్నారు. వారంతా ప్రస్తుతం గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నారు. ఐతే కరోనా ఎఫెక్ట్ తో ఇమ్మిగ్రేషన్ ను యూఎస్ ఆరు నెలల పాటు నిలిపివేసింది. దీంతో వీరి పరిస్థితి ఏమిటన్నదీ క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. యూఎస్ లో హెచ్ 1 బీ వీసా పై పనిచేస్తున్న వారంతా ఉద్యోగం కోల్పోతే తర్వాత రెండు నెలల లోపు తిరిగి వేరే ఉద్యోగంలో చేరాలి. లేదంటే వీసా రెన్యువల్ చేసుకోవాలి. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ నిలిచిపోవటంతో వీరికి వీసా రెన్యువల్ అయ్యే పరిస్థితి లేదు. పైగా అమెరికాలోనే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవటంతో జాబ్స్ లో వారికే ఫస్ట్ ప్రిపరెన్స్ వారికే ఇవ్వాలని నిర్ణయించారు. ఫలితంగా హెచ్ 1 బీ వీసా హోల్డర్స్ ఇప్పడు పరిస్థితి ఏంటా అని అంతా తలలుపట్టుకుంటున్నారు. రెసిడెన్షియల్ స్టేటస్ కోసం ప్రయత్నించని వారు కూడా తిరిగి స్వదేశాలకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇండియన్సే ఎక్కువ
సాధారణంగా హెచ్ 1 బీ వీసాలు టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికే ఎక్కువగా ఇస్తారు. దీంతో అమెరికాలోని ప్రముఖ కంపెనీలు హెచ్ 1 బీ వీసా ద్వారా విదేశాల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులే ఇందులో ఎక్కువగా ఉంటారు. ఇతర రంగాల్లోఉద్యోగం చేసేందుకు వెళ్లే వారైనా సరే హెచ్ 1 బీ వీసా తో పనిచేస్తూ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ లేదా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలా హెచ్ 1 బీ వీసా ద్వారా అమెరికా వెళ్లే వారిలో ఇండియన్సే 70 శాతం ఉంటారు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారికి వీసా రెన్యువల్ గానీ కొత్త ఉద్యోగం గానీ దొరికే పరిస్థితి లేదు. దీంతో హెచ్ 1 బీ వీసా తో అమెరికాలో ఉన్న ఇండియన్స్ లో ఆందోళన మొదలైంది.
సెప్టెంబర్ 10 వరకు గడవు పెంచాలి
ప్రముఖలోని ప్రముఖ లాబీయింగ్ సంస్థ టెక్ నెట్ మాత్రం హెచ్ 1 బీ వీసా హోల్డర్ల లీగల్ స్టేటస్ ను సెప్టెంబర్ 10 వరకు పొడగించాలని కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 17 నే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు లెటర్ రాసింది. ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యాపిల్, అమెజాన్, ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాప్ట్ లాంటి ప్రముఖ సంస్థలకు నెట్ టెక్ లాబీయింగ్ చేస్తుంది. ఈ సంస్థల్లోనే హెచ్ 1 బీ వీసా హోల్డర్స్ ఎక్కువగా పనిచేస్తున్నారు. ఆయా సంస్థలు అమెరికా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.

Latest Updates