
రాజౌరి: దాయాది పాకిస్తాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో పాక్ కాల్పులకు తెగబడింది. దాయాది కాల్పులకు భారత జవాన్లు దీటుగా బదులిచ్చారు. ఈ కాల్పుల్లో నాయక్ ప్రేమ్ బహదూర్ ఖాత్రి, రైఫల్మ్యాన్ సుఖ్బీర్ సింగ్ అనే భారత ఆర్మీ జవాన్లు చనిపోయారు. ఎల్వోసీ వెంబడి ఫూంచ్ జిల్లాలోని కిర్నీ, ఖస్బా సెక్టార్స్లో గురువారం కూడా పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఈ కాల్పుల్లో సుబేదార్ స్వతంత్ర సింగ్ చనిపోయారు.