పాక్‌ నుంచి ఫోన్‌కాల్‌: తాజ్‌ హోటల్‌కు బాంబు బెదిరింపు

  • ఫోన్‌ చేసిన గుర్తతెలియని వ్యక్తి

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని తాజ్‌ హోటల్‌కు బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. పాకిస్తాన్‌ నుంచి గుర్తు తెలియన వ్యక్తి ఫోన్‌ చేసి బాంబు ఉన్నట్లు చెప్పాడని అన్నారు. దీంతో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ టైట్‌ చేశారు. కరాచీ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఈ ఫోన్‌ చేశాడని తెలుస్తోందని అన్నారు. ఈ ఫోన్‌ ఆధారంగా ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కోలాబాల్‌లోని తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌, బాండ్రాలోని తాజ్‌ ట్యాండ్స్‌ ఎండ్‌ ల్యాండ్‌ లైన్స్‌కు ఫోన్లు వచ్చాయని అప్పటి నుంచి సెక్యూరిటీ పెంచి కాలర్‌‌ని గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు. 2008లో టెర్రరిస్టులు ఇదే హోటల్‌ లక్ష్యంగా చేసుకుని మారణహోమం సృష్టించారు. 26/11 టెర్రరిస్టు ఎటాక్‌గా పిలిచే ఈ ఘటనలో చాలా మంది ఫారినర్స్‌ సహా 166 మంది చనిపోయారు.