ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

బుడ్గాం: జమ్మూ కశ్మీర్‌‌లోని బుడ్గాంలో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో బుడ్గాం జిల్లా, మచామాలోని చదూరా ప్రాంతంలో శనివారం రాత్రి జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలసి సీఆర్‌‌పీఎఫ్‌‌తో కార్డన్ సెర్చ్ నిర్వహించింది. ఆ సమయంలో అక్కడే పొంచి ఉన్న టెర్రరిస్టులు సెక్యూరిటీ ఫోర్సెస్ పై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్‌‌కౌంటర్‌‌‌గా మారింది. భద్రతా దళాలు, మిలిటెంట్లకు మధ్య నాలుగు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు జైష్-ఏ-మొహమ్మద్ (జేఈఎం)కు చెందిన వారని అధికారులు తెలిపారు. ఈ ఇద్దరిలో ఒకరు స్థానిక వాసి అయ్యుండొచ్చునని చెప్పారు.

Latest Updates