చింతమడకపై కేసీఆర్ వరాల జల్లు

2-thousand-houses-will-construct-in-chintamadaka-village-says-cm-kcr

చింతమడకలో పర్యటించిన సీఎం కేసీఆర్ ..ఆ ఊరుకి వరాల జల్లు కురిపించారు. పోమవారం చింతమడకలో మాట్టాడారు సీఎం. ‘చింతమడక నన్ను పెంచింది. నేను వచ్చిపోగానే చింతమడకలో సమస్యలు ఉండరాదు. ప్రభుత్వం తరపున ఉరిలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాము.  కార్పోరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తాం. యావత్తు తెలంగాణలో ఉన్న ప్రజలందరి హెల్త్ ప్రోఫైల్ ఏర్పాటు చేస్తాం. దీనికి చింతమండక నుండే నాంది పలుకుతాం. ప్రతి ఇంటికి 10లక్షలు ఇస్తాం.

దీనికోసం 200కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా. గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తాం. సిద్దిపేట బాగా అబివృద్ది అవుతుంది. ఆరు నెలలో చింతమండకకు 24 గంటల మంచినీటిని అందించే దిశగా చర్యలు తీసుకుందం . చింతమండకకు 1500ల పక్క ఇండ్లను మంజూరు చేయిస్తా. చింతమడకకు నేను ఏం చేసిన తక్కువే… దీని అభివృద్ది కోసం 50 కోట్ల డబ్బును కలెక్టర్ వద్ద ఉంచుతున్నానని తెలిపారు సీఎం కేసీఆర్.

Latest Updates