కరోనా వ్యాక్సిన్లపై ఎయిమ్స్ డైరక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ లో విడుదల కానున్న కరోనా వ్యాక్సిన్లపై ఎయిమ్స్ డైరక్టర్ రణదీఫ్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మనదేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లను వినియోగించే అవకాశం ఉందన్నారు. వాటిలో సీరమ్ ఇనిస్టిట్యూట్ డెవలప్ చేస్తున్న కోవీషీల్డ్ తో పాటు,భారత్ బయోటెక్ ఫార్మా అభివృద్ది చేస్తున్న కోవ్యాగ్జిన్‌  అత్యవసర వాడకానికి అనుమతి పొందే అవకాశం ఉందన్నారు. అనుమతి లభిస్తే  ఆరోగ్య కార్యకర్తలకు మొదట వ్యాక్సిన్ అందించే అవకాశం ఉందన్నారు.

కాగా ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశంలో దాదాపుగా 8 కరోనా వ్యాక్సిన్లు వివిధ అభివృద్ది దశల్లో ఉన్నాయి. భారత్‌లో తయారవుతున్న మూడు కరోనా వ్యాక్సిన్లు కూడా వివిధ అభివృద్ది దశల్లో ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని నిపుణులు చెప్తున్నారు. బహుశా మరికొద్ది రోజుల్లోనే భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చు అని మోడీ పేర్కొన్నారు.

 

Latest Updates