2ఏళ్ల చిన్నారికి సోకిన కరోనా వైరస్ : సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్లు

కరోనా వైరస్ సోకిన 2ఏళ్ల చిన్నారికి ఆస్పత్రి వైద్యులు సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పంజాబ్  నవాన్‌షహర్ కు చెందిన 70ఏళ్ల వృద్ధుడికి కరోనా వైరస్ సోకి మృతి చెందాడు. అతని కుటుంబంలో ఉన్న మొత్తం 14మందికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అందులో వృద్ధుడి కోడలికి సంవత్సరం మనవడికి  కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం బాధితులు పంజాబ్ నవాన్ షహర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన చిన్నారి శనివారం రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. పుట్టిన రోజుపై సమాచారం అందుకున్న ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. చిన్నారి పుట్టిన రోజు సందర్భంగా ఆస్పత్రి వార్డ్ లలో  క్యాండిల్స్  వెలిగించి కేక్ కట్ చేశారు. సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ బర్త్ డే వేడుకలు నిర్వహించారు.

 

Latest Updates